Sunday, December 8, 2019

*♦భయం లేదు*
*♦గౌరవం లేదు*
*♦ఇక చదువు ఎట్లా?*
👉టీచర్ అంటే విద్యార్థులకు
     భయం లేదు, గౌరవం
    అసలే లేదు.
👉కొట్టొద్దు.తిట్టొద్దు.
👉బడికి రానోన్ని ఎందుకురా
     రాట్లేవు అని అడగొద్దు.
👉చదవాలని,హోమ్ వర్క్
     అని,కొట్టినా తిట్టినా
     టీచర్లదే తప్పు.
👉ఒకవేళ కొట్టినవే అనుకో
     బడి ముందు ధర్నా,
     టీచర్ పై దాడి,పోలీస్ కేసు,
     సస్పెండు.
👉8వ తరగతి నుండే
      కటింగు స్టైలు,చినిగిన
     జీన్స్ పాయింట్లు.
👉గోడల మీద కూసోవటం,
     అరేయ్ సార్ వస్తుండరా
     అని అంటే వస్తే రానియ్
     అంటున్నారు.
👉దరిద్రం ఏంది అంటే
     కొంతమంది తల్లిదండ్రులే
     నువ్వు చెప్పకున్నా
     ఎం లేదు గాని మావోన్ని
     కొట్టకు అంటున్నారు.
👉ఇదే అలుసుగా పిల్లలు
     టీచర్ ఏదన్నా అనగానే
     పోలీస్ స్టేషన్ గూడా
     పోతున్నారు.
👉పెన్ను ఉంటే కాఫీ ఉండదు,
     కొనరు, తెచ్చుకోరు అరె
     భయం ఉండాలని రెండు
     దెబ్బలు ఎద్దమంటే
    ఎటునుంచి పోయి ఎటు
    వస్తదో అని భయం.
♦ఇయన్ని సుస్తుంటే
     పిల్లల కంటే సార్లకే భయం
     ఎక్కువ.
♦అరె ఎట్ట అయితే అట్ల
     ఐతది అని అనుకుందాం
     అంటె పానం ఒప్పదాయే.
🔷నాకు అస్సలు అర్ధం కాంది
      కొట్టకుండా,తిట్టకుండా,
      భయపెట్టకుండా సదువు
      వాస్తదా !
* 🚩✍క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల నడవడికపై ఎన్నోసార్లు హెచ్చరించినా వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు... ఉపాధ్యాయులుగా మనం చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాము. తల్లిదండ్రులకు  తమ పిల్లలపై  శ్రద్ద,  నియంత్రణ లేక పోతే ఇలానే తయారవుతారు..
క్రమశిక్షణ మాటలతో రాదు... కొద్దిపాటి దండన,భయభక్తులు ఉంటేనే వస్తుంది..
రావణుడికి, విభీషణుడుకి ఇదేతేడా....

👉పిల్లలకి బడి లో భయంలేదు.
ఇంట్లో భయం లేదు.
కావుననే సమాజం ఈ రోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.
వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు.
అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.
గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.
ఇది నిజం...!

No comments:

Post a Comment